Mouth Cancer | నోటి క్యాన్సర్‌ను గుర్తించే యాప్.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత
Mouth Cancer | వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ఆరోగ్య సరంక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు. దీన్ని అధిగమించడంలో ఆధునిక సాంకేతికతలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌తోనే ఓరల్ క్యాన్సర్ (నోటి క్యాన్సర్)ను గుర్తించవచ్చని తేలింది.
- ట్రిపుల్ ఐటీ విద్యార్థుల స్మార్ట్‌ఫోన్ యాప్ తయారీ
- ప్రయోగంలో సత్ఫలితాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ఆరోగ్య సరంక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు. దీన్ని అధిగమించడంలో ఆధునిక సాంకేతికతలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌తోనే ఓరల్ క్యాన్సర్ (నోటి క్యాన్సర్)ను గుర్తించవచ్చని తేలింది. దీనిపై ఐహబ్ డాటా, ఐఎన్ఏఐతో కలిసి నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చినట్టు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) అధికారులు తెలిపారు.
ఏఐ సాయంతో పలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రముఖ చిప్ కంపెనీ ఇంటెల్ ఐఎన్ఏఐ పేరుతో ట్రిపుల్ ఐటీలో ఓ రిసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నోటిలోని గాయాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సుతోపాటు మెషీన్ ల్యాంగ్వేజ్‌లను ఉపయోగించి ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారని, దీని సాయంతో ఓరల్ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని ఐఎన్ఏఐ సీఈవో కోనాల వర్మ వివరించారు. ప్రయోగ దశలో విజయవంతమైన ఈ విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

