హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అనువుగా గ్రేటర్తోపాటు శివారు మున్పిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే 120.92 కి.మీ మేర 50 చోట్ల లింకు రోడ్లను నిర్మించేందుకు సుమారు రూ.1500 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్న ఈ పనులకు రూ.1150 కోట్ల రుణానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ రంజయ్ మిశ్రా ఆమోదం తెలిపారు. బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్కుమార్ను కలిసి రుణ మంజూరు పత్రాన్ని అందజేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఆర్డీసీ విభాగాల ఆధ్వర్యంలో ఆయా శాఖలు పనులపై దృష్టి సారించాయి.