Hyderabad | బేగంపేట్, నవంబర్ 25: స్కూల్లో ఓ విద్యార్థి పూరీలు తింటుండగా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్లోని బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ జయచంద్ర కథనం ప్రకారం.. ఓల్డ్ బోయిగూడకు చెందిన విరేన్జైన్(11) ఆరోతరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో మూడు పూరీలు నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుపోయాయి. పాఠశాల సిబ్బంది విరేన్జైన్ తల్లిదండ్రులకు సమాచారం అందించి ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.