హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పదో తరగతి పాసైనోళ్లలో కొందరు అంతటితోనే చదువులకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇంటర్‌లోపే 25శాతం మంది విద్యార్థులు చదువులకు స్వస్తి పలుకుతున్నట్టు విద్యాశాఖ తేల్చింది. రాష్ట్రంలో ఏటా 5 లక్షల మంది పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో 25 శాతం అంటే దాదాపు లక్షకు పైగా ఇంటర్‌తోనే ఆపేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ కలిపితే 3,287 జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో ప్రైవేట్ కాలేజీలు 1,482 కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీలు, మాడ ల్ స్కూళ్లు కలిపి 1,805 కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ఇటీవల 25 వరకు కొత్త కాలేజీలు మంజూరయ్యాయి. వీటిలో గత బీఆర్ఎస్ సర్కారు అప్‌గ్రేడ్ చేసినవి, మంజూరుచేసిన గురుకులాలు, కాలేజీలే అధికంగా ఉన్నాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 9, 10 తరగతుల్లో 94 శాతంగా ఉండగా, ఇంటర్‌కు వచ్చేసరికి 76% ఉంది.