మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:16:13

108 అంబులెన్స్‌లో ఇద్దరికి ప్రసవం

108 అంబులెన్స్‌లో ఇద్దరికి ప్రసవం

మంచిర్యాల అర్బన్‌, జనవరి 3: మంచిర్యాల జిల్లాలోని 108 అంబులెన్స్‌లో ఆదివారం ఒకే రోజు ఇద్దరు గర్భిణులు ప్రసవించారు. తొలుత శ్రీరాంపూర్‌కు చెందిన రామిల్ల రమ్యశ్రీ(25)కి పురిటినొప్పులు వస్తున్నట్టు నస్పూర్‌కు చెందిన 108 అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని రమ్యశ్రీని మంచిర్యాలకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. వాహనాన్ని నిలిపి ఈఎంటీ వినోద్‌, పైలట్‌ రాజ్‌కుమార్‌ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ, వారి సూచనల మేరకు పురుడు పోశారు. రమ్యశ్రీకి ఆడ శిశువు జన్మించింది. ఈ క్రమంలోనే సీసీసీ కార్నర్‌కు చెందిన రత్నజ్యోతి(38)కి పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ, పైలట్‌లు వినోద్‌, రాజ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని ఈఆర్‌సీపీ డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ పురుడు పోశారు. రత్నజ్యోతి కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.