మెదక్ మున్సిపాలిటీ, జనవరి 18 : అప్పుడే పుట్టిన పసిపాపకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడిన ఘటన మెదక్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. మెదక్ ప్రభుత్వ దవాఖానలో అప్పుడే పుట్టిన పాప ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండడంతో 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ నిలోఫర్ దవాఖానకు తరలించారు. మార్గమధ్యలో చిన్నారి గుండె ఆగిపోవడంతో అంబులెన్స్ టెక్నిషీయన్ రాజు సీపీఆర్ చేశారు. అనంతరం నిలోపర్ దవాఖానలో చేర్పించడంతో పాప ఆరోగ్యంగా ఉంది. టెక్నిషీయన్ రాజు, పైలెట్ నవీన్‌ను జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అభినందించారు.
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ కగార్ పేరిట ప్రభుత్వం ఆదివాసీలను ఎన్కౌంటర్లు చేస్తున్నదని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం వారు ప్రకటన విడుదల చేశా రు. గత రెండు, మూడు రోజులుగా వేలాది బలగాలతో పాటు డ్రోన్ బాం బులు, హెలికాఫ్టర్ల ద్వారా మెషిన్గన్లతో కాల్పులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అలాంటి దాడుల్లోనే తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి చనిపోయినట్టు ఆ పార్టీ సైతం ప్రకటనలో తెలిపిందని వివరించారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, ఎన్కౌంటర్ పేరిట ఆదివాసీలను హత్యలు చేయడాన్ని ఉద్యమకారులు ఖండించాలని కోరా రు. బడే చొకరావు ఎన్కౌంటర్, కగార్ పేరిట ఎన్కౌంటర్ల ముసుగులో చేస్తున్న హత్యలను పౌరహకుల సం ఘం తరఫున తీవ్రంగా ఖండించారు.