హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం 1,078 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ కలెక్టర్ తాజాగా ఇరిగేషన్‌శాఖ భూసేకరణ అధికారులకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని సరఫరా చేసేందుకు 18.85 కి.మీ. కాలువ తవ్వాల్సి ఉన్న ది. ప్రధాని కృషి సించాయ్ యోజన పథకంలో క్యాచ్మెంట్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం నోడల్ అధికారిని నియమించింది.