హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో ఒకేసారి 106మందిని బదిలీ చేశారు. హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్ టెరిటోరియల్ పరిధిలోని ఎస్ఈ మొదలు ఏఈఈ, ఏఈల వరకు అందరికీ స్థానచలనం కల్పించారు. ఈ మేరకు ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా మంగళవారం సా యంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ టెరిటోరియల్ పరిధిలో ప్రాజెక్టులేవీ లేకున్నా ఇండ్లు, భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) జారీ కీలకంగా ఉన్నది. అయితే ఇటీవల ఎన్వోసీల జా రీలో భారీగా అక్రమాలు వెలుగుచూశాయని ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో గతంలో హైదరాబాద్ సీఈని తప్పించి ఈ ఎన్సీ జనరల్‌కు అటాచ్ చేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ సీఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా హైదరాబాద్ టెరిటోరియల్‌లో పనిచేస్తున్న అందరికీ స్థానచలనం కల్పించారు. ఎస్ఈ ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఏఈలను వివిధ ఇరిగేషన్ సర్కిల్స్‌కు ఓడీపై పంపించారు. వారి స్థానంలో వివిధ సర్కిల్స్‌లో పనిచేస్తున్న వారిని ఓడీలపై నియమించారు. మొ త్తంగా 106మందికి స్థానచలనం కల్పించారు. ఎస్ఈగా కాగజ్‌నగర్ ఎస్ఈ రవికుమార్‌ను నియమించగా, బెల్లంపల్లి ఎస్ఈ విష్ణుప్రసాద్‌కు కాగజ్‌నగర్ ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీలపై చర్చ జరుగుతున్నది.
ముగ్గురు ఇంజినీర్ల ఆస్తుల అటాచ్ ; విజిలెన్స్ విభాగం నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఇంజినీర్ల ఆ స్తులను ప్రభుత్వానికి అటాచ్ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్ణయించింది. ఇరిగేషన్‌శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) మురళీధర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరాం, ఈఈ శ్రీధర్ ఇండ్లలో గతంలో ఏ సీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని అభియోగాలు మోపింది. ము గ్గురు ఇంజినీర్ల ఆస్తుల చిట్టాను ఇరిగేషన్‌శాఖకు పంపింది. దీంతో ఆస్తులను అటాచ్ చేయాలని విజిలెన్స్ వి భాగం నిర్ణయించింది. ముగ్గురు ఇం జినీర్లకు సంబంధించి అటాచ్ చేయనున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ఇరిగేషన్‌శాఖలో 106మంది బదిలీ