హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కారు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటిలో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మరో 995 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజాగా ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతితో ఇప్పటిదాకా మొత్తం 45,325 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినైట్టెంది. వీటిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వివిధ దశల్లో ఉన్నవి 20,391 ఉద్యోగాలు.
బీజేపీ ఉద్యోగ ప్రకటనలు జుమ్లానే: హరీశ్‌రావు
తాజా ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గతంలో 35,220 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం వివిధ శాఖల్లో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ట్వీట్ చేశారు. తాజా ప్రకటనతో కలిపి ఇప్పటిదాకా 45,325 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, త్వరలోనే మరిన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. కొందరు (బీజేపీ) చేసే ఉద్యోగాల ప్రకటనలు జుమ్లానేనని తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
తాజాగా అనుమతి ఇచ్చిన పోస్టులు: 10,105
గతంలో అనుమతి ఇచ్చిన పోస్టులు: 35,220
ఆర్థిక శాఖ అనుమతిచ్చిన మొత్తం పోస్టులు: 45,325
నోటిఫికేషన్లు ఇచ్చి వివిధ దశల్లో ఉన్న పోస్టులు: 20,391