హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎంబీసీ సంఘాల కన్వీనర్ కొండూరు సత్యనారాయణ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8 బీసీ కులాలకు వెంటనే పాలకమండళ్లను నియమించాలని కోరారు. కార్పొరేషన్లు లేని ఇతర బీసీ కులవృత్తులకు కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.