హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): ఈసారి పదిమంది మహిళా ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లనున్నారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పదిమంది మహిళలు విజయం సాధించారు. ఇందులో నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందగా, ఆరుగురు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
వారిలో బీఆర్ఎస్ నుంచి లాస్యనందిత, కాంగ్రెస్ తరపున నారాయణపేట నియోజకవర్గం నుంచి పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి రాగమయి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఈ సారి అదనంగా నలుగురు గెలుపొందారు.