ముషీరాబాద్, జనవరి 6: మాదిగలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్అక్తర్ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఎస్సీ వర్గీకరణతో అట్టడుగు కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందేలా చూడాలని, గ్రూప్-ఏ లో చేర్చాలని కమిషన్ను కోరారు. జస్టిస్ రామచంద్ర, జస్టిస్ ఉషామెహ్రా కమిషన్లు వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయని, తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పు వెలువరించినట్టు గుర్తుచేశారు. అత్యంత వెనుకబడిన మాస్ట్రి, డక్కలి, చెందు కులాలను ఎస్సీ-ఏ లో చేర్చాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గణేశ్, కృష్ణ, యాదగిరి, శ్రీను, వేణు, రమేశ్, శాంతికిరణ్, వెంకట్, చందు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జనవరి 6(నమస్తే తెలంగాణ): మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సరోద్ విద్యాంసుడు ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో spicmacay ఆధ్వర్యంలో ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ సంగీత సభ జరిగింది. అంజాద్ అలీఖాన్ మాట్లాడుతూ తమ తల్లులను గౌరవించిన మాదిరిగానే సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధిస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొనటం హర్షణీయమని కొనియాడారు. సంగీత విభావరిలో భాగంగా ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ తన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మొదట ప్రముఖ తబలా వాద్యకారులు ఆదిత్య కల్యాణ్పూర,అమిత్ కావ్తేకర్ జుగల్బందీ ఆకట్టుకుంది.