మహబూబ్‌నగర్, నవంబర్ 14: మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ క ళాశాలలో జూనియర్ వైద్యవిద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసినందుకుగానూ 2023 బ్యాచ్‌కు చెందిన 10 మందిని సస్పెండ్ చేశారు. ఈ విషయం గురువా రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జిల్లా కేంద్రంలోని ఎదిర సమీపంలో ఉన్న వైద్య కళాశాల క్యాంపస్‌లో చదువుతున్న 2022-2023 బ్యాచ్‌కు చెంది న రెండో సంవత్సరం విద్యార్థులు.. 2023-2024 ఫ్రెషర్స్‌ను వారంరోజుల కిందట రాత్రి సమయంలో ర్యాగింగ్ చేసినట్టు సమాచారం.
ర్యాగింగ్‌తో కొత్త గా చేరిన విద్యార్థులు తీవ్ర మనస్తాపాని కి గురైనట్టు కళాశాల డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వివరాలు సేకరించి ర్యాంగింగ్కు కారణమైన 10 మందిని సస్పెండ్ చేసినట్టు తెలిసింది. ర్యాగింగ్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ తెలిపారు.