నల్లగొండ : నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 1,72,113 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4 గేట్లు 5 అడుగులు ఎత్తగా, మరో 6 గేట్లను 10 అడుగులు ఎత్తారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.7 అడుగులు. గరిష్ట నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 311.14 టీఎంసీలు.