వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులు బుధవారం ఒక్క రోజే పది సాధారణ కాన్పులు చేసి అరుదైన ఘనతను సాధించారు. ఈ మేరకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు వివరాలు వెల్లడించారు. ఒకే రోజు పది మంది గర్భిణులకు సాధారణ కాన్పులు చేయగా ఇందులో ఆరుగురు మగ, నలుగురు ఆడ శిశువులు జన్మించారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులను, సిబ్బందిని అభినందించారు.
-వేములవాడ