హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సీఎంఆర్ఎఫ్కు మంగళవారం రూ.10కోట్ల విరాళాలు అందాయి. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఎంఈఐఎల్ ఎండీ కృష్ణారెడ్డి, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్టీ రావు రూ.5కోట్ల చెక్కును అందజేశారు. రేస్ క్లబ్ డైరెక్టర్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, డైరెక్టర్ నర్సింహారెడ్డి రూ.2కోట్ల చెక్కు ఇచ్చారు. సియాంట్ లిమిటెడ్ రూ.కోటి, లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ రూ.కోటి, మైత్రా ఎనర్జీ, అక్షత్ గ్రీన్టెక్ డైరెక్టర్లు విక్రమ్ కైలాస్, రవి కైలాస్ రూ.కోటి, సినీ నిర్మాత దిల్రాజు రూ.25 లక్షలు అందజేశారు.