హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,64,546 క్యూసెక్కుల వరద వస్తున్నది. విద్యుదుత్పత్తి, స్పిల్వే ద్వారా 3,45,205 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా, ఇప్పుడు 213.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.