ముకరంపుర, ఫిబ్రవరి 1 : కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ క్వారీ లీజు నిబంధనలు ఉల్లంఘంచినందుకు భూగర్భ గనులశాఖ అధికారులు మొత్తం పది కేసులను నమోదు చేశారు.
క్వారీ హద్దులను అతిక్రమించి ఖనిజ తవ్వకాలు జరిపినందుకు నాలుగు కేసులు నమోదు చేసి రూ.6.11 కోట్లు, ఖనిజాన్ని రవాణా చేసే వాహనాలను తనిఖీ చేసి 6 కేసులు నమోదు చేసి, రూ.5.12 లక్షల జరిమానా విధించారు.