Sangareddy | జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న వ్యవసాయ పొలంలో చెరుకు పంటను కోసి.. లారీ నిండా లోడ్ చేశారు. ఇక లారీని అక్కడ్నుంచి తరలిస్తున్న క్రమంలో.. విద్యుత్ వైర్లకు చెరుకు తగిలి మంటలు చెలరేగాయి.
రైతు సంజీవరెడ్డి అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలానికి చెరుకుని మంటలను అర్పివేశారు అగ్నిమాపక శాఖ అధికారులు. దీంతో లారీ పాక్షికంగా కాలిపోయింది. 10 ఎకరాల పొలంలో నరికిన చెరుకుతో పాటు డ్రిప్ పరికారులు, పంపు సెట్ తదితర వస్తువులు కాలిపోయాయి. దీంతో రూ. 10 లక్షల వరకు నష్టం జరిగిందని బాధిత రైతు సంజీవ్‌రెడ్డి వాపోయారు. మరో రైతు దేవీ సింగ్ మూడు ఎకరాల చెరుకు తోట కూడా కాలిపోయింది. దేవీసింగ్‌కు రూ. 3 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
KTR | నేడు టెంట్లను కూలగొట్టినట్టే.. రేపు ఏదో దశలో ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు : కేటీఆర్
Hyderabad | భార్యను ముక్కలుముక్కలుగా నరికి చంపి.. కుక్కర్లో ఉడికించిన భర్త