6 Arrested For Killing A Cow | పిక్నిక్కు వెళ్లి ఆవును వధించి వండుకుని తిన్న కొందరు.. వీడియో వైరల్‌తో అరెస్ట్
6 Arrested For Killing A Cow | కొందరు యువకులు పిక్నిక్కు వెళ్లారు. ఆవును వెంట తీసుకెళ్లారు. దానిని కోసి వండుకుని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
గౌహతి: కొందరు యువకులు పిక్నిక్కు వెళ్లారు. ఆవును వెంట తీసుకెళ్లారు. దానిని కోసి వండుకుని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. (6 Arrested For Killing A Cow) అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసల్పారా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఇటీవల బోటులో పిక్నిక్కు వెళ్లారు. ఆవు, దానిని వధించే కత్తులు, వంట పాత్రలను తమ వెంట తీసుకెళ్లారు. ఒక చోట ఆవును కోసి దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. తమ పిక్నిక్కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్స్ వైరల్ అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అస్సాం పశు సంరక్షణ, పశువుల అక్రమ వధ, వ్యాపార నిషేధిత చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను సాహిల్ ఖాన్ (20), హఫీజుర్ ఇస్లాం (19), రోకిబుల్ హుస్సేన్ (20), సాహిదుల్ ఇస్లాం (30), ఇజాజ్ ఖాన్ (26), జాహిదుల్ ఇస్లాం (24)గా గుర్తించి వారిని అరెస్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Assam
- Killing Cow
- picnic
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

