ఫర్టిలైజర్‌సిటీ, ఫిబ్రవరి 1: రామగుండం(Ramagundam)లోని ఆర్ఎఫ్సీఎల్(RFCL)లో గత జనవరిలో 1,22,489.10మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి(Urea production) జరిగినట్లు సీజీఎం సుధీర్‌కుమార్ ఝా గురువారం వెల్లండించారు. అందులో తెలంగాణకు 50,945.58 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 19,091.52, కర్ణాటకకు 12,120.84, మహారాష్ట్రకు 5,982.30, ఛత్తీస్‌గఢ్‌కు 20,574.54, తమిళనాడుకు 8,142.48, మధ్యప్రదేశ్‌కు 5,631.84 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను సరఫరా చేశామన్నారు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంటు పూర్తిస్థాయి సామర్థ్యంతో కొనసాగడంతోనే యూరియా ఉత్పత్తి సాధించామని సీజీఎం వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.