హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): పీఎంఏవై-యు కింద పట్టణ పేదలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,13,681 ఇండ్లు మంజూరు చేసింది. ఇందుకు రూ.1,705.21 కోట్లు మంజూరు చేసింది. మంజూరైన నిధుల్లో మొదటి విడతగా రూ. 682.08 కోట్లు విడుదలకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. కేంద్రం నిధుల నుంచి ఒక్కో లబ్ధిదారుకు రూ.1.5 లక్షలు సాయం అందనుంది. మిగిలిన రూ.3.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.3,978.83 కోట్లు అవుతుంది. ఇప్పటికే కేంద్రం సాయంతో నిర్మించిన ఇండ్లలో 58,000 ఇండ్ల ఆక్యుపెన్సీ వివరాలు తమకు సమర్పించలేదని, ఆ ఇండ్ల వివరాలు అందించాలని కేంద్రం లేఖలో కోరింది.