హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల వ్యవహారంలో కొన్ని మీడియా చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయని, జగన్మోహన్రావుకు పడిన ఓట్ల విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ఊహాగానాలతో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని తెలంగాణ సీఐడీ తప్పుబట్టింది. హెచ్సీఏ ఎన్నికల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఓటింగ్ హక్కుల గురించి ఊహాగానాలను ప్రసారం చేయడం మానుకోవాలని సీఐడీ డీజీ చారుసిన్హా హితవు పలికారు.