నిజామాబాద్: ఎగువన భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 33 గేట్లు ఎత్తి 4.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా.. ప్రస్తుతం 1087.4 అడుగుల వద్ద నీటి మట్టం ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు. ప్రస్తుతం 74.506 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.