రవీంద్రభారతి, జూలై 2: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు.
గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 18 బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1500 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను ఎత్తి వేస్తాననడం సరికాదని పేర్కొ న్నారు. మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఉన్నత విద్యా కోర్సులకు 10 వేల ర్యాంకు నిబంధనలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయి ంబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని అన్నారు.