బొంరాస్‌పేట, ఆగస్టు 9: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల, పోలెపల్లి, రోటిబండతాండ, పులిచెర్లకుంటతండా, హకీంపేట గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. భూములు అందించినవారికి ఇప్పటివరకు పరిహారం అందించకపోవడంతో ఓ రైతు తిరగబడ్డాడు. లగచెర్లకు చెందిన చెవుల హనుమంతు అనే దళిత రైతుకు సర్వే నంబర్ 102లో 3 ఎకరాలకుపైగా భూమి ఉన్నది. పారిశ్రామికవాడ ఏర్పాటులో ప్రభుత్వానికి అప్పగించిన తన భూమికి రావాల్సిన రూ.60 లక్షల పరిహారం ఇప్పటివరకు చెల్లించకపోవడంతో శనివారం ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులుచేపట్టాడు. ప్రభుత్వం పరిహారం చెల్లించేవరకు తన పొలం దున్నుకొంటానని పేర్కొన్నాడు.