హైదరాబాద్ మే 20 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని ప్రఖ్యాతిగాంచిన వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న తన మేనల్లుడు, ఎమ్మెల్సీ కవిత పెద్ద కుమారుడు ఆదిత్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆదిత్య డిగ్రీ పట్టా సాధించి తమ కుటుంబం గర్వపడేలా చేశారని మంగళవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.