
నల్లగొండ రూరల్, అక్టోబర్ 6: నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామంలో గత నెల 22న జరిగిన హత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. త్వరలో ఆర్థిక సాయాన్ని అందజేస్తామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఉన్నారు.