హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 22ఏ కింద నెలకొన్న భూ సమస్యలన్నింటిపై విచారణ జరిపి అర్హులైన పేదలందరికీ భూములు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
శాసనసభ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి భూ సమస్యలపై చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్, భూదాన్, ఫారెస్ట్, వక్ఫ్‌బోర్డ్ భూములపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.