షాద్నగర్, మే10: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎంపీ నవనీత్కౌర్పై షాద్నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్కు ఓటు వేస్తే పాకిస్తాన్కు వేసినట్లే అనే వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కోడ్ పర్యవేక్షణ అధికారులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమో దు చేయాలని షాద్నగర్ పోలీసులకు సూచించారు.