శంకరపట్నం, ఫిబ్రవరి 6 : పొలం పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ రై తు కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట్లో విషాదం నిం పింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు బొజ్జ సమ్మయ్య (53) తనకున్న ఒకటిన్నర ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు వరి పొలానికి నీళ్లు పెట్టడం కోసం వెళ్లాడు. ఒడ్డుపై నడుస్తుండగా సమ్మయ్యకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనున్న రైతులు వచ్చి చూడగా పొలంలో పడి ఉన్నాడు. 108కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు. సమ్మయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పాలే రు లింక్ కెనాల్లో భూమి కో ల్పోతాననే ఆందోళనతో ఓ రైతు గుండెపోటుకు గురయ్యా డు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బగూడెం వద్ద నిర్మించే కెనాల్లో భూములు కోల్పోయే రైతుల వివరాల జాబితాను గురువారం అధికారులు ప్రకటించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న మూడుతండాకు చెందిన రైతు మూడు బాలునాయక్ తన భూమి కోల్పోతాననే ఆందోళన చెందడంతో గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. బాలునాయక్కు వంశపారంపర్యంగా వచ్చిన మూడెకరాల భూమి లింక్ కెనాల్లో పోతుందని తెలిసి బోరున విలపిస్తున్నాడు. ప్రాణం పోయినా భూమిని మాత్రం ఇవ్వనని తెలిపాడు. మున్నేరు జలసాధన కమిటీ స భ్యులు బాలునాయక్ను ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.