హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల స్టే ట్ ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. టాప్ వంద ర్యాంకులతో కూడిన జాబితాను శనివారం విడుదలచేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారీగా చేసిన నమోదు ఆధారంగా ఈ జాబితా ప్రకటించింది. ఇది సమాచార నిమిత్తమేనని వర్సిటీకి దరఖాస్తులు అందిన తర్వాత మెరిట్ జాబితాను విడుదలచేస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. నీట్ కట్ ఆఫ్ సోర్ వివరాలను కూడా వెల్లడించింది. జనరల్ /ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి 50 పర్సంటైల్, కట్ ఆఫ్ సోర్ 138 కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 పర్సంటైల్, కట్ ఆఫ్ సోర్ 108 అని, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్, 122 కట్ ఆఫ్ సోర్ అని కాళోజీ వర్సిటీ వివరించింది.