నాగర్‌కర్నూల్, జూన్ 30 : నాగర్‌కర్నూల్ లో ‘సర్’ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్టు విమర్శలు వ స్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తు న్న కొందరు అధికారులు ఆ పార్టీ కార్యకర్తల తో ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తూ ఫొ టోలు దిగి అధికారిక గ్రూప్‌లో అప్లోడ్ చేయడమే నిదర్శనం. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. బీఎల్వోలు అన్ని పార్టీల బీఎల్ఏల సమక్షంలో ఇంటింటా ఎన్యుమరేషన్ ఫారా లు పంచాలి. కానీ నాగర్కర్నూల్ని 114వ బూత్‌లో అందుకు విరుద్ధంగా పంపిణీ చేశారు. అధికార పార్టీకి చెందిన బీల్ఏ కాని ఓ వ్యక్తి బీఎల్వోతో ఫారాలు తీసుకొని ఓటర్లను తన వద్దకు పిలిపించుకొని పంచారు. బీఆర్ఎస్కు చెందిన బీఎల్ఏకు ఎలాంటి స మాచారం ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ వ్యక్తికి ప్రతిరోజూ సమాచారం ఇస్తూ ఆ బూత్‌లో ఫారాలు పంపిణీ చేయడం అనుమా నాలకు తావిస్తున్నది. అధికారిక గ్రూప్‌లో సదరు వ్యక్తి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీచే స్తూ దిగిన ఫొటోలు అప్లోడ్ చేసినా సంబంధిత అధికారులు పట్టింపు లేకుండా ఉండటం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి.