బెంగళూరు, అక్టోబర్ 25: కర్ణాటకలో ఇటీవల వెలుగుచూసిన నకిలీ ఓటరుకార్డు, ఆధార్‌కార్డు కేసు లో సీబీఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశం జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నందున వాటితో దర్యాప్తు జరిపించడమే ఉత్తమమని తెలిపింది. ఈ కేసులో అరెస్టు అయిన ముగ్గురు నిందితులు కాం గ్రెస్ మంత్రి సురేశ్ సన్నిహితులని వెల్లడించింది.