ఆసిఫాబాద్, అక్టోబర్29 : కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ పెట్రోల్ బంక్లో జరిగిన 23 వేల లీటర్ల డీజిల్ కుంభకోణంలో అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేస్తున్నారు. శుక్రవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ ఇందుకు కారణమైన ఆరుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.