కంటితుడుపు చర్యగా పెట్రోల్ మీద రూ.5, డీజిల్ మీద రూ.10 తగ్గించి ఘనకార్యం చేసినట్టు చెప్తున్నరు. పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత. ఈ గొప్పతనానికి, చేసిన మోసానికి.. రాష్ట్రాలు కూడా తగ్గించాలి అంటున్నరు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరగకున్నా పెరిగినట్టు చెప్పలేదా మీరు? పెంచింది మీరు, ప్రజలమీద భారం మోపింది మీరు. ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని సెస్‌లు వెంటనే వెనక్కు తీసుకోవాలి. అప్పుడు ఆటోమెటిక్‌గా పెట్రోల్ ధర రూ.77కి తగ్గుతుంది.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెట్రో ధరలు కొండంత పెంచి, పిసరంత తగ్గించి ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారని కేంద్రం, బీజేపీని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. పెట్రో సెస్‌లు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయ న మాటల్లోనే.. ‘కంటితుడుపు చర్యగా పెట్రోల్ మీద రూ.5, డీజిల్ మీద రూ.10 తగ్గించి ఘనకార్యం చేసినట్టు చెప్తున్నరు. పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత. ఈ గొప్పతనానికి,చేసిన మోసానికి.. రాష్ట్రాలు కూడా తగ్గించాలి అంటున్నరు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగిందా? చూపిస్తారా? ఈ ధరలు అబద్ధం చెప్పలేవు కదా! పెరగకున్నా పెరిగినట్టు చెప్పలేదా మీరు? ఎట్ల పెంచారు? ట్యాక్సులు ఎట్ల వేశారు? పెంచింది మీరు, ప్రజలమీద భారం మోపింది మీరు. ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని సెస్‌లు వెంటనే వెనక్కు తీసుకోవాలి. అప్పుడు ఆటోమెటిక్‌గా పెట్రోల్ ధర రూ.77కి తగ్గుతుంది. 30-35 రూపాయలు పెంచి అందులో రూ.ఐదు తగ్గిచ్చి మేమేదో పీకిపడగొట్టినం, మీరు కూడా తగ్గించండి, లేకుంటే ధర్నాలు చేస్తాం అని మాట్లాడుతున్నారు.
రాష్ర్టాల నోరు కొడుతున్న కేంద్రం
సెస్ రూపంలో 100 శాతం డబ్బులు వాళ్లే (కేంద్రం) తీసుకుంటున్నరు. రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే రాష్ర్టాలకు 41 శాతం వాటా ఇవ్వాలి. దాన్ని ఎగ్గొట్టడానికి, రాష్ర్టాల నోరుగొట్టి మొత్తం కేంద్రమే తీసుకుంటున్నది. ధర్నాలు మీరు చేయాల్నా, మేం చేయాల్నా? కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీని డిమాండ్ చేస్తున్నం. సెస్ విరమించుకోండి. ప్రజల మీద భారం వేయొద్దంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే 2014 నాటి రేట్ రూ.77కే పెట్రోల్ ఇవ్వొచ్చు. మీరు ప్రజల మీద భారం వేశారు. మేం పెంచగలిగేది వ్యాట్ ఒక్కటే. మేం అధికారంలోకి వచ్చిననాడు వ్యాట్ ఎంతుండేనో ఇప్పుడూ అంతే ఉన్నది. పక్కనున్న ఏపీ రోడ్ సెస్ అంటూ ఒక రూపాయి తీసుకుంటున్నారు. మేం రూపాయి కాదు కదా పైసా కూడా తీసుకోలేదు. ఒకటి.. మీరు సెస్ పెంచారు, రెండు.. మేం వ్యాట్ పైసా పెంచలేదు. (బండి సంజయ్‌ను ఉద్దేశించి) ఈ రోజు మమ్మల్ని తగ్గించాలని నువ్వు ఏ నైతికతతో మాట్లాడుతవ్? అడ్డం పొడుగు ఇష్టం వచ్చినట్టు, నోటికొచ్చినట్టు అహంకారంతో మాట్లాడతావా. మితిమీరి, అతిమీరి మాట్లాతున్నావ్. నన్ను వ్యక్తిగతంగా నిందించినా నేను భరించా.
రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే రాష్ర్టాలకు 41 శాతం వాటా ఇవ్వాలి. దాన్ని ఎగ్గొట్టడానికి, రాష్ర్టాల నోరుగొట్టి సెస్ అని పేరు పెట్టి మొత్తం కేంద్రమే తీసుకుంటున్నది.