హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిషరించాలని గురుకుల విద్యాజేఏసీ డిమాండ్ చేసింది. కొత్త టైమ్‌టేబుల్‌ను వెంటనే అమలుచేయాలని, అన్ని గురుకులాలకు కామన్ డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేయాలని, విద్యార్థుల మెస్‌చార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా గురుకుల అధ్యాపకులు విధులకు హాజరయ్యారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు బాలరాజు, యాదయ్య, మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో 28న విధులను బహషరించి, పెన్‌డౌన్ / చాక్‌డౌన్ నిర్వహిస్తామన్నారు.