హైదరాబాద్ సిటీబ్యూరో,ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆదివారం ఉదయం ల్యాబ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయ గా, క్లూస్‌టీమ్ మరోసారి తనిఖీలు చేపట్టింది. కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లు పరిశీలించినట్టు స మాచారం. ప్రమాదంలో 40 కం ప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్ లు, పెన్‌డ్రైవ్ దగ్ధం అయినట్టు గుర్తించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా కుట్రకోణం ఉన్నదా అనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషించే ఈ ల్యాబ్‌లో దాదాపు అన్ని కీలక ఫైల్స్ తగలబడిపోయినట్టు తెలుస్తున్నది.
ఐదు రూముల్లో సామగ్రి నష్టం
ఎఫ్ఎస్ఎల్లోని మొదటి అంతస్తులో కీలకమైన ఐదు గదుల్లో సా మగ్రి పూర్తిగా కాలిపోయినట్టు ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రమాద ఘటనపై ఆయన నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ల్యాబ్‌లో దట్టమైన పొగ అలుముకుని మిగతా రూమ్‌ల కు వ్యాపిస్తున్నదని శనివారం ఉద యం ఎఫ్ఎస్ఎల్లో పనిచేసే 4వ తరగతి ఉద్యోగి సాయికృష్ణ నుంచి తనకు కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారమివ్వాలని సూచించానని చెప్పారు. ఫైర్ సిబ్బంది చేరుకొని సహాయకచర్యలు చేపట్టడంతో మధ్యాహ్నం ఒకటిన్నరకు మంటలు అదుపులోకి వ చ్చాయని వివరించారు. ఐదు గదు లు పూర్తిగా దెబ్బతిన్నాయని, అందు లో సర్వర్ రూమ్, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ చాంబర్, అనాలసిస్ చాంబర్లు ఉన్నాయని తెలిపారు. హెచ్ఆర్డీ హాల్, ఫర్నిచర్ అగ్ని ప్ర మాదంలో కాలిపోయాయని పేర్కొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ ఫైర్ యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేశారు.