హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాబోయే ఏడేండ్లు విద్యుత్తు సరఫరా చేసేందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తుశాఖ అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
సోమవారం టీజీ ట్రాన్స్‌కో సంస్థ బలోపేతంపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో 27వేల మెగావాట్ల డిమాండ్‌ను అధిగమించేందుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్, డిప్యూటీ సీఎం కృష్ణభాస్కర్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.