కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 7 : కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు వాటి అనుబంధ విభాగాల కమిటీలతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ నాయకులు మిల్కూరి వాసుదేవరెడ్డి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.లక్షల కోట్ల విలువైన అటవీ, ఖనిజ సంపదను తమ అనుకూల కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసమే కేంద్రం మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని బూటకపు ఎన్కౌంటర్లు చేయిస్తున్నదని మండిపడ్డారు.