హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : టీచర్లు, పెన్షనర్ల మెడికల్ బిల్లులను ఆన్లైన్లో స్వీకరించమన్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఐఎస్ఎంఎస్ పోర్టల్ ద్వారా బిల్లులను ప్రాసెస్ చేస్తామని, వివరాల కోసం https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ.50వేల వేతనాన్ని అమలు చేయాలని గవర్నమెంట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్(జీడీజీఎల్ఏ) డిమాండ్ చేసింది. డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాంపల్లిలోని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట గెస్ట్ లెక్చరర్లు నిరసన తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 7 నెలల వేతనం మాత్రమే తీసుకుంటున్నామని, 12 నెలల కన్సాలిడేటెడ్ పే కింద వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న వారినే రెన్యూవల్ చేయాలని కోరారు.