వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా రూపొందుతున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణరెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్చంద్ర నిర్మాతలు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. జూలై 3న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో వయసు పైబడిన రాయల్ లుక్‌లో సత్యదేవ్ కనిపించారు. సైకలాజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఓ ఇంటెన్స్ వాతావరణం ఈ పోస్టర్లో కనిపిస్తున్నది. దీపా థామస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పర్మార్, సంగీతం: స్మరణ్‌సాయి, నిర్మాణం: ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్.