నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 19 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేట ర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న (సోమవారం) వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హా జరుకావాలని ఆదేశించింది. ఈ కేసు లో చిక్కడపల్లి పోలీసులు ఏ1 నుంచి ఏ10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం, అందులోని సభ్యులను చేర్చగా, అల్లు అర్జున్ను ఏ11గా నమో దు చేసి చార్జ్‌షీట్‌ను రూపొందించారు. ఈ చార్జ్‌షీట్‌ను ఇంతకుముందు కోర్టు మూడుసార్లు తిప్పిపంపింది. అనంతరం తప్పులను సరిచేసిన అధికారులు చివరికి చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. చార్జ్‌షీట్‌లో 23 మందిని నిందితులుగా పేర్కొనగా.. కోర్టు నలుగురిని తొలగించింది. అనంతరం 19 మందికి సమన్లు జారీచేసింది. ఈ కేసులో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తాజాగా నిందితులందరికీ సమన్లు జారీ చేయడంతో ఇక విచారణ ప్రారం భం కానుంది. కాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చి వీడియో కా న్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కేసు విచారణకు సోమవారం అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలిసింది.