హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ 2018 ఎన్నికల సందర్భంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే ప్రజలు, రైతులు తిరస్కరించారని, ఇప్పుడూ అదే పాత పాట పాడితే ఎవరు నమ్ముతారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
పెట్టుబడి సాయం రూ.15వేలు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు కాంగ్రెస్ పాలిత రాష్ర్టా ల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్ కమిటీ సిఫారసు చేస్తే దాన్ని తొక్కిపెట్టింది యూపీఏ సర్కారేనని తేల్చిచెప్పారు. ప్రజల సుదీర్ఘ పోరాటాలతోనే తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని టీఆర్ఎస్ సృష్టించటం వల్లే కేంద్రం ఇచ్చిందన్న విషయాన్ని మరిచిపోకూడదన్నారు.