
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ప్రగతినగర్‌లో వాచ్ మెన్‌గా పని చేస్తున్న సుబ్బారావు కుమారుడు బట్టీల వీరదుర్గ (19), వేములపూరి దుర్గాప్రసాద్(20) ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి వస్తున్నారు.
సరిగ్గా ప్రగతినగర్ డాలర్ హిల్స్ వద్దకు రాగానే బైక్ డివైడర్‌ను ఢీకొన్నది. దీంతో వెనుక కూర్చున్న వీరదుర్గ ఎగిరి పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న దుర్గాప్రసాద్ స్వల్ప గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో బాధితులు మద్యం సేవించి ఉన్నారని తెలుస్తున్నది.