నందికొండ: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 58066 కూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను మంగళవారం నాటికి 589.60 అడగుల వద్ద 310.8498 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8067 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32683 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1200 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ఎడమ, వదర కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 882.20 (200.1971 టీఎంసీలు ) వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 39252 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.