తెలంగాణ ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సామూహికంగా నూతన సంవత్సర వేడుకలకు అందరూ దూరంగా ఉండాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉంటే వేడుకలు సంవత్సరం పొడవునా చేసుకోవచ్చని ఆయన చెప్పారు. వేడుకలకు దూరంగా ఉంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని మంత్రి సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని ఆయన కోరారు. అందుకే వేడుకలు వద్దు.. ఆరోగ్యం ముద్దు అన్నది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని పాటించాలని మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.