హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు గురువారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కేసీఆర్ బీ-ఫామ్ అందజేశారు.
ఉప ఎన్నికల్లో ప్రచారం, తదితర ఖర్చుల కోసం రూ. 28 లక్షల విలువైన చెక్‌ను టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ నేత పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.