హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై(BRS NRI ) శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌కు (28 న భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 05:00 గంటలకు) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR ) హాజరు కానున్నారని బీఆర్ఎస్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. తెలంగాణలో శాసనసభకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో 2018లో బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ఎన్నారైలు ప్రచారాన్ని నిర్వహించారని, అలాగే ఈసారి కూడా ఈ ఎన్నికలలో అటు సోషల్ మీడియా కాంపెయిన్‌తో పాటు ప్రత్యక్షంగా కొన్ని నియోజక వర్గాలలో ఎన్నారైలు పర్యటించి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఎన్నారైలని ఉద్దేశించి మాట్లాడుతారని, రాబోయే ఎన్నికల ప్రచారంలో ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలి అనే దానిపై దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.