పండుగ పూట కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పలేదు. ఎడ్ల పొలాల అమావాస్య పండుగను సంతోషంగా నిర్వహించుకోవాల్సిన రైతులు శుక్రవారం యూరియా పంపిణీ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాగు సంబురంగా చేసుకుందామనుకున్న రైతన్నలకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరలేదు.